Trending Now

ఆటగాళ్లను అలా జడ్జ్ చేయకండి


మీడియాకు కెప్టెన్ రోహిత్ శర్మ హితవు

మహ్మద్ షమీకి టీమిండియా కెప్టెన్ అండగా నిలిచాడు. ఒకప్పుడు షమీ. జట్టు కోసం ఎలా ఆడాడో,ఎలాంటి విజయాలు అందించాడో మీడియాకు గుర్తు చేశాడు. గాయం కారణంగా దాదాపు యేడాది పాటు ఆటకు దూరంగా ఉన్న షమీ ఇంగ్లాండ్ టీ20, వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో తొలి వన్డేకు ముందు ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో షమీ కమ్ బ్యాక్ ఇచ్చే ముందు దేశవాళీలో పూర్ పెర్ఫామెన్స్ చేశాడంటూ ఓ విలేకరి ప్రశ్న వేశాడు. దీంతో రోహిత్ శర్మ అసహనానికి గురయ్యాడు. కొన్ని దేశవాళీ మ్యాచులను దృష్టిలో పెట్టుకొని ఆటగాళ్లను జడ్జ్ చేయొద్దని హితవు పలికాడు. పదేళ్లలో షమీ నిలకడగా ఆడుతూ ఎన్నో విజయాలను సాధించాడని గుర్తు చేశాడు. 2023 వన్డే వరల్డ్ కప్ లో షమీ అద్భుత ప్రదర్శన చేశాడని పేర్కొన్నాడు. దేశవాళీ మ్యాచులలో సరిగ్గా రాణించనంత మాత్రాన, అతడు అసమర్థుడని నిర్ధారించకూడదన్నాడు. ఇప్పుడేం జరిగిందనేదే చూస్తున్నామని, గతంలో ఏం చేశాడన్నది మర్చిపోతున్నామని అన్నాడు. ‘మనకు షార్ట్ టెర్మ్ మెమరీ లాస్ ఉందనుకుంటా’ అను వ్యంగ్య వ్యాఖ్యలు చేశాడు రోహిత్.

Spread the love

Related News