ప్రతిపక్షం, మక్తల్: నారాయణపేట్ జిల్లా మక్తల్ సర్కిల్ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మంగళవారం ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో మహబూబ్ నగర్‌కు చెందిన సంధ్య వెంకట్రావు అనే వ్యక్తి నుండి 20,000/- రూ లంచం తీసుకుంటుండగా మహబూబ్‌నగర్ ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సీఐ జి. చంద్రశేఖర్‌తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు శివరెడ్డి, నరసింహలులను కూడా అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్ నగర్ ఏసీబీ డీఎస్బాపీ బాలకృష్ణ వీరిని విచారిస్తున్నారు అలాగే వారి ఇండ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.