Trending Now

తొలి వన్డే గెలిచిన టీమిండియా


నాలుగు వికెట్ల తేడాతో ఓడిన ఇంగ్లండ్

ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో తొలి వన్డేను టీమిండియా గెలుచుకుంది. నాగ్‌పూర్ లో గురువారం జరిగిన ఈ మ్యాచులో సమష్టిగా రాణించి నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా, జడేజా, బ్యాటింగ్‌లో శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ రాణించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 47.4 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ జోస్ బట్లర్ 52, జాకోబ్ బెతెల్ 51 పరుగులు చేశారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా (3/26), హర్షిత్ రాణా(3/53) మూడేసి వికెట్లు తీశారు. మహమ్మద్ షమీ, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ కు తలో వికెట్ దక్కింది. అనంతరం భారత్ 38.4 ఓవర్లలోనే 6 వికెట్లకు 251 పరుగులు చేసి సునాయసంగా గెలుపొందింది. శుభ్‌మన్ గిల్ 87, అక్షర్ పటేల్ 52. శ్రేయస్ అయ్యర్ 59 పరుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో సకీబ్ మహ్మూద్(2/47), ఆదిల్ రషీద్(2/49) రెండేసి వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, జాకోబ్ బెతెల్ తలో వికెట్ పడగొట్టారు. సూపర్ ఫీల్డింగ్‌తో ఫిల్ సాల్ట్‌ను రనౌట్ చేసిన శ్రేయస్ అయ్యర్, బ్యాటింగ్‌లో రెండు కీలక వికెట్లు కోల్పోయిన తర్వాత దూకుడుగా ఆడి మ్యాచ్‌ను భారత్‌వైపు మలుపు తిప్పాడు. ఇంగ్లండ్ పేలవ ఫీల్డింగ్ కూడా భారత్‌కు కలిసొచ్చింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా 1-–0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే ఆదివారం కటక్ లో జరుగుతుంది.

Spread the love

Related News