భారతీయులను అవమానకరంగా పంపారు
ఉభయ సభలలో ఈ అంశంపై చర్చించాలి
పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన
(పతిపక్షం నేషనల్ బ్యూరో)
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను అమానుష రీతిలో వెనుకకు పంపారని విపక్ష ఎంపీలు మండిపడ్డారు. అక్రమ వలసదారులను చేతులు కట్టి, కాళ్లు కట్టి విమానంలో పంపించడడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు, ఇందుకు నిరసనగా గురువారం రోజున పార్లమెంట్ ఆవరణలో నిరసన ప్రదర్శన చేశారు. భారతీయులను అమెరికా అసభ్య రీతిలో బహిష్కరించడంపై ఉభయ సభలలో చర్చించాలని డిమాండ్ చేశారు. విపక్ష నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ, అఖిలేష్ యాదవ్ ఈ నిరసనలో పాల్గొన్నారు. భారతీయులను ఇంత దారుణంగా పంపించినా, భారత ప్రభుత్వం ఇంత మౌనంగా ఎందుకుందని విపక్ష నేతలు ప్రశ్నించారు. కాగా, తెలంగాణ కాంగ్రెస్ నేతలు చేతికి సంకెళ్లు వేసుకోని నిరసనలో పాల్గొన్నారు.