Trending Now

Breaking: ఎన్​కౌంటర్​ మృతులు 31 మంది

ఛత్తీస్​గఢ్​లో ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ విషయాన్ని బస్తర్​ ఏరియా ఐజీ సురేందర్​రాజ్​ స్పష్టం చేశారు. బీజాపూర్​నేషనల్​ పార్క్​ సమీపంలో ఆదివారం ఉదయం పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు చనిపోగా ఇద్దరు జవాన్లు కూడా చనిపోయారని ఐజీ తెలిపారు. ఆదివారం ఉదయం నుండి బీజాపూర్​ నేషనల్​ పార్క్​ అటవీ ప్రాంతంలో తుపాకుల మోతలు మోగుతూనే ఉన్నాయి. మావోయిస్టుల కోసం ఇంకా అటవీ ప్రాంతంలో సెర్చ్​ ఆపరేషన్​ కొనసాగుతున్నదని ఐజీ సుందర్​ రాజ్​ తెలిపారు.

Spread the love

Related News