Trending Now

‘కళ్యాణ లక్ష్మి’ల సమక్షంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు..

కళ్యాణ లక్ష్మి పథకానికి పురుడు పోసిన భాగ్య తండాలో కేసిఆర్ జన్మదిన వేడుకలు

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, హైదారాబాద్/ములుగు, ఫిబ్రవరి 17:

కళ్యాణ లక్ష్మి పథకానికి పురుడు పోసిన భాగ్య తండాలో కేసిఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో భాగ్య తండాలో జరిగిన కేసీఆర్ పుట్టినరోజు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరైయ్యారు. స్వరాష్ట్ర సాదన పోరాటంలో సమ్మక్క- సారలమ్మ సందర్శనకు వెల్లిన కేసీఆర్ కు బాగ్యతండాలో చలించే దృశ్యం.. అగ్ని ప్రమాదంలో కాలి బూడిదైన తండాకు చెందిన కీమ్యానాయక్ – బుజ్జిల కుమార్తె వివాహాం కోసం దాచుకున్న డబ్బులు,సామాగ్రీ.. విషయాన్ని గులాబీ దళపతి దృష్టికి నాటి జిల్లా అద్యక్షుడు పెద్ది సుదర్శన్ రెడ్డి తీసుకెళ్ళారు. యాకుబ్ – కల్పనల పెళ్ళికి సహాయం కేసీఆర్ అందించారు. ఈ సంఘటనతో ప్రభుత్వంలోకి వచ్చాక కళ్యాణ లక్ష్మి పథకానికి కేసీఆర్ రూపకల్పన చేశారు.. యాకుబ్ – కల్పన ల బిడ్డ చంద్రకళ వివాహన్ని తన సొంత ఖర్చులతో తన క్యాంపు కార్యాలంలో బీఆర్ఎస్ సీనియర్ నేత,ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి జరిపించారు. పండంటి ఆడభిడ్డకు చంద్రకళ జన్మించింది. కేసీఆర్ స్పూర్తి నింపి,సహాయం చేసి,కళ్యాణలక్ష్మి కి పురుడుపోసిన బానోత్ కీమ్యనాయక్ – బుజ్జి ల మూడుతరాల కుటుంబం సమక్షంలో జన్మదిన వేడుకలు జరిపారు. కేసీఆర్ సాయం మరవలేమన్న కుటుంబసభ్యులు..వారికి జన్మదిన శుభాకాంక్షలు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా నాటి జ్ఞాపకాలను పెద్ది సుదర్శన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. అనంతరం తండాల్లో ఉన్న గిరిజనులకు చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ములుగు జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ జిల్లా పార్టీ నాయకులు మండల నాయకులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Spread the love

Related News