ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ ఇంటర్ ఫలితాలు 2024 ఇవాళ విడుదల అయ్యాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు తాడేపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సౌరబ్ గౌర్ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. గత కొద్ది రోజులుగా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న విద్యార్ధుల నిరీక్షణకు తెరపడినట్లైంది.
ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 67 శాతం, సెకండ్ ఇయర్‌లో 78 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్ట్ ఇయర్‌లో 84 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. రెండో స్థానంలో గుంటూరు, మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 90 శాతం ఉత్తర్ణతతో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది.