Jani Master Wife Sumalatha comments: టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ అయేషా సంచలన వ్యాఖ్యలు చేశారు. తన భర్త తప్పు చేసినట్లు నిరూపిస్తే వదిలేస్తానని పేర్కొన్నారు. జానీ మాస్టర్ ప్రతిభను ప్రోత్సహించేవారని, ఎవరికైనా అవకాశాలు లేకుండా ఆయన ఎందుకు చేస్తారని మండిపడ్డారు. కాగా, ఓ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జానీ మాస్టర్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు.
ఈ మేరకు జానీ మాస్టర్ సతీమణి మీడియాతో మాట్లాడారు. నా భర్త కెరీర్‌ను నాశనం చేయాలని చూస్తున్నారని, జానీ మాస్టర్ ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. జనసేన పార్టీలో యాక్టివ్‌గా ఉండడంతో ఇదంతా చేస్తున్నారని ఆయేషా ఆరోపించారు. అయితే ఆ అమ్మాయి మైనర్‌గా ఉన్నప్పుడు ఘటన జరిగిందనడానికి సాక్ష్యమేంటి? ప్రశ్నించారు. కొరియోగ్రాఫర్‌గా అగ్ర స్థానంలో ఉండాలి లేదా హీరోయిన్‌గా స్థిరపడాలనేది ఆ అమ్మాయి, ఆమె తల్లి కోరిక అన్నారు. ఒకవేళ లైంగిక వేధింపులకు గురైతే.. ‘జానీ మాస్టర్ వద్ద పని చేయడం నా అదృష్టం’ అని నవ్వుతూ ఎందుకు చెబుతుందన్నారు.