ప్రతిపక్షం, జూలై 24: కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఢిల్లీలోని గాంధీ స్మృతి కేంద్రం వద్ద నిర్వహించిన ఆందోళనలో కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
దేశ ప్రజాస్వామ్యం కోసం మహాత్మా గాంధీతో పాటు ఎందరో చేసిన త్యాగాలను గుర్తు చేస్తూ, ఆ విలువలను బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.
పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలపై ప్రశ్నిస్తూ బాధ్యత వహించాలని కోరిన విద్యార్థులపై దాడులు చేయడం సరైంది కాదని ప్రియాంకా గాంధీ అన్నారు. ప్రజల ఆవేదనను అణచివేయడం కాకుండా సమస్యలకు పరిష్కారం చూపాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె కోరారు.
















