Trending Now

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌-జాకీభగ్నానీ జంటకు ప్రధాని మోదీ స్పెషల్‌ విషెస్‌..

ప్రతిపక్షం, సినిమా: నూతన జంట రకుల్‌ ప్రీత్‌ సింగ్‌-జాకీభగ్నానీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక శుభాకాంక్షలు అందించారు. దీనికి సంబంధించిన ఒక నోట్‌ను స్వయంగా రకుల్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేసింది. ‘‘మా సరికొత్త జర్నీలో మీ ఆశీర్వాదాలు, మా హృదయాలను తాకాయి. ఇవి మాకెంతో విలువైనవి.. ధన్యవాదాలు’’ అంటూ రకుల్‌, జాకీ ఇద్దరూ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.

కాగా ధనికవర్గాలు విదేశాల్లో కాకుండా భారతదేశంలోనే డెస్టినేషన్ పెళ్లిళ్లు చేసుకోవాలని, తద్వారా.. పర్యాటక రంగానికి, ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వాలన్న భారత ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు.. విదేశాల్లో చేసుకోవాలనుకున్న వీరి పెళ్లి తొలి ప్లాన్‌ను గోవాకు మార్చుకున్నారనే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే.

Spread the love

Related News

Latest News