నాణ్యమైన విద్యుత్తును అందించి దుబ్బాక రైతులను ఆదుకోండి

  • మంత్రి వివేక్ వెంకటస్వామి కి రైతుల వినతి పత్రం

ప్రతి పక్షం దుబ్బాక అక్టోబర్ 16: దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట్ భూంపల్లి మండలం నగరం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి ఫంక్షన్ హాల్ లో శుక్రవారం జరిగిన 2 బి హెచ్ కే గృహాల పంపిణీ , కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి కి రైతుల పక్షాన దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నాణ్యమైన విద్యుత్తును రైతులకు అందించాలని కోరుతూ వందలాదిమంది రైతులతో కలిసి మంత్రి కి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కూడవెల్లి వాగు లో పంటలకు సరిపడ నీళ్లు ఉన్న ప్రభుత్వం సరిపోయేంత విద్యుత్తు సరఫరా చేయ లేకపోవడం వలన ఈ ప్రాంత రైతులు తీవ్రంగా నష్ట పోయే అవకాశాలు ఉన్నందున , ప్రతి రోజు 14 గంటల విద్యుత్ సరఫరా చేయాలని మంత్రిని కోరారు.

Spread the love

Related News

Latest News