మెదక్‌లో ఘనంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ జన్మదిన వేడుకలు

ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం.. ఆలయాలు, చర్చిలు, దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు

ప్రతిపక్షం ప్రతినిధి, మెదక్ నవంబర్ 01: మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ జన్మదిన వేడుకలను ఆదివారం మెదక్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.ముందుగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వెంకటేశ్వర ఆలయం, ప్రసిద్ధ మెదక్ సీఎస్ఐ చర్చి, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు, యువకులు భారీ ర్యాలీ చేపట్టి రాందాస్ చౌరస్తాలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రిలో రోగులు, వారి సహాయకులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ కానుగు రాధిక భూపతిరాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ నాయకత్వంలో మెదక్ నియోజకవర్గం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందన్నారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ఎన్నికై పట్టణ, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని కొనియాడారు.మెదక్ పట్టణంలోని మూడు ప్రధాన చౌరస్తాల ఆధునికీకరణకు రూ.2 కోట్లతో పనులు చేపడుతున్నారని, పట్టణ అభివృద్ధికి సుమారు రూ.500 కోట్ల విలువైన అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని గుడిసెలు లేని గ్రామంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

మైనంపల్లి స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా నిరుపేదలకు వైద్య సహాయం, అనాథ పిల్లలకు జీవిత బీమా వంటి సేవా కార్యక్రమాలు అందిస్తున్నారని, అలాగే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో గ్రామాల్లో బోరుబావులు ఏర్పాటు చేసి తాగునీటి సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్నారని వివరించారు. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మందు గుల గంగాధర్, నాయకులు చంద్రపాల్, భూపతిరాజు, బుజ్జ, పవన్, ఉప్పల్ రాజేష్, కౌన్సిలర్లు తుడుపునూరి రాము, గంట సంపత్, గోదల మానస, సాయి, రాణి, బాలరాజు, సంధ్య, నవీన్, సిద్ధి రాములు, కోరివి రాములు, మంబోజీపల్లి మహేష్ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు, సర్పంచులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Related News

Latest News