Trending Now

కేంద్ర కొత్త ఎన్నికల కమిషనర్లుగా ఇద్దరు నియామకం..

ప్రతిక్షం, వెబ్ డెస్క్: కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను సీఈసీ నియమించింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా పంజాబ్‌కు చెందిన సుఖ్‌బీర్ సింగ్ సంధు, కేరళకు చెందిన జ్ఞానేష్ కుమార్‌ లను ఎంపిక చేసిన్నట్లు లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఈ రోజు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ప్రస్తుతం ప్యానెల్‌లో కేవలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం ఈయనకు సాయం చేసేందుకు ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ప్యానెల్ ఇరువురిని ఎంపిక చేసింది. ఈ సమావేశానికి పీఎం మోడీతో పాటు ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, కేంద్ర హోమంత్రి అమిత్ షా హాజరయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్యానెల్‌లో ముగ్గురు సభ్యుల్లో ఇటీవల ఒకరు పదవీ విరమణ చేయగా.. మరొకరు రాజీనామా చేశారు. దీంతో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ (సీఈసీ) రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు.

Spread the love

Related News

Latest News