ప్రతిపక్షం ప్రతినిధి,మెదక్, అక్టోబర్ 07: మెదక్ మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ నేత కానుగు భూపతి రాజ్ బుధవారం పర్యటించారు. 21, 22వ వార్డుల్లో పర్యటించిన ఆయన స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ప్రధానంగా మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, సీసీ రోడ్ల నిర్మాణం తదితర సమస్యలపై ప్రజలతో చర్చించారు. ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు అవసరమో స్థానికులను అడిగి తెలుసుకుని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా వార్డుల కౌన్సిలర్లు, గౌస్ కురేషి మన్సూర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






























