- ఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలి
- జెండా స్థంభాన్ని కూల్చినా పార్టీ ఆశయాలను కూల్చలేరు: వరుకొలు రాకేష్
ప్రతిపక్షం, మానకొండూర్, నవంబర్ 17: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం నిజాయితీగూడెం గ్రామంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీ జెండా స్థంభాన్ని కూల్చివేయడాన్ని బీఆర్ఎస్ నాయకుడు వరుకొలు రాకేష్ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన బాధాకరమని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.జెండా అనేది కేవలం ఒక వస్తువు కాదని, అది పార్టీ గుర్తింపునకు, కార్యకర్తల ఆత్మగౌరవానికి, వారి ఆశయాలకు ప్రతీక అని అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, అభిప్రాయ భేదాలు సహజమే అయినప్పటికీ, ఇలాంటి చర్యలకు పాల్పడటం సరైన విధానం కాదన్నారు.ఈ ఘటనకు పాల్పడిన వారు ఎవరైనా సరే, వారిని వెంటనే గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు. జెండా స్థంభాన్ని కూల్చినంత మాత్రాన బీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని, పార్టీ ఆశయాలను దెబ్బతీయలేరని స్పష్టం చేశారు.గులాబీ జెండా మా గౌరవం.. బీఆర్ఎస్ మా ఆత్మగౌరవం అని వరుకొలు రాకేష్ పేర్కొన్నారు.





























