హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్ బ్యూరో: నిన్న వరంగల్ జిల్లా దేవరుప్పుల మండలం లక్ష్మీబాయి తండా కు క్షేత్ర స్థాయి పర్యటన చేశాం.. రైతుల పరిస్థితి ద్సయనీయంగా ఉందని మాజీ మంత్రి ఇవాళ తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో వెల్లడించారు. ఒక్కో రైతు నాలుగైదు బోర్లు వేశామని మాకు చెప్పారని.. పంటలు ఎండుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని కాంగ్సెస్ పై ఫైరయ్యారు. తండాల్లో తాగు నీరు కూడా సరిగా రావడం లేదని.. రైతుల మీద శ్రద్ద లేదు గానీ ఈ ప్రభుత్వానికి చిల్లర మల్లర చేష్టలకు పాల్పడుతోంది.. 180 రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. కనీసం క్షేత్ర స్థాయి కి అధికారుల బృందాన్నీ కూడా పంపలేదని మండిపడ్డారు.
మళ్ళీ రైతులు అప్పుల పాలవుతున్నారు..
బ్యాంకు అధికారులు రైతులకు అప్పులు కట్టాలని లీగల్ నోటీసులు ఇస్తున్నారు. అందోల్ నియోజకవర్గం రేగోడ్ మండలం లో గ్రామీణ వికాస్ బ్యాంకు అధికారులు అనేక గ్రామాల్లో అప్పులు కట్టాలని రైతులకు నోటీసులు ఇస్తున్నారని.. రేవంత్ రెడ్డి ఏం చెప్పారో తమకూ సంబంధం లేదని రుణాలు కట్టాల్సిందేనని బ్యాంకు అధికారులు గ్రామాల మీద పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇది రుణాల వసూలకు అనువైన సమయమా..?
రైతుపై మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు బ్యాంకు అధికారులు పడుతున్నారు.
..రేవంత్ ఎన్నికలప్పుడు ఏం చెప్పా రు.. ఇపుడు ఏం చేస్తున్నారు..? రైతులకు నాలుగు ప్రధాన హామీలు ఇచ్చి.. కాంగ్రెస్ నట్టేట ముంచిందని కాంగ్రెస్ పై హరీశ్ రావు ఫైరయ్యారు. కాంగ్రెస్ ఏ మొహం పట్టుకుని పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడుగుతుంది? అని ప్రశ్నించారు.
రైతుల పొలాలు సందర్శించాలని కేసీఆర్ బీ ఆర్ ఎస్ శ్రేణులను ఆదేశించారు. రేపు, ఎల్లుండి , ఆ మరసటి రోజు పొలాలకు వెళ్లి పంట నష్టం వివరాలు పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. తక్షణమే ఎకరాకు 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని.. రైతుల పక్షాన అన్ని వేదికల మీద పోరాడతామని స్పష్టంచేశారు. రాజకీయ చేరిక ల మీద ద్రుష్టి సారిస్తున్నారు తప్ప రైతు కన్నీటి చారికల మీద దృష్టి సారించడం లేదని మండిపడ్డారు. నష్ట పోయిన రైతుల వివరాలు ప్రభుత్వం వెంటనే సేకరించాలి. ఎన్నికల కోడ్ ప్రకృతి వైపరీత్యాల సాయానికి అడ్డు కాకూడదని తెలిపారు. పార్టీ కేంద్ర కార్యాలయానికి పంట నష్టం పై వచ్చిన వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని.. మేము ఎన్నికల కోడ్ ఉందని కాంగ్రెస్ లాగా ఏ ఫిర్యాదు చేయమని తెలిపారు. రైతులకు సాయం విషయం లో రాజకీయాలకు పాల్పడం.. రాజకీయాలు మాని రైతులకు మేలు చేయండని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.