226 మంది విద్యార్థుల గైర్హాజురు
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 24 : నిర్మల్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన పాలిటెక్నిక్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగాయి. ఈ పరీక్షలకు మొత్తం 1946 మంది విద్యార్థిని, విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 1720 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షలు రాశారని పరీక్షల కన్వీనర్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ అన్నపూర్ణ తెలిపారు. 226 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ పరీక్షలకు గైర్హాజరయ్యాయరని పేర్కొన్నారు. 88.30 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారని వివరించారు.