Trending Now

హామీలను అమలు చేయించడానికి ముందుకు..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 11 : పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు మాకు బస్ సౌకర్యం కల్పించమని కోరారు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది కోడ్ ముగిసిన తరువాత తప్పకుండా అధికారులతో మాట్లాడి గ్రామాలకు బస్ వచ్చేలా కృషి చేస్తాం అని చెప్పిన విధంగానే ఈ రోజు నిర్మల్ బస్ డిపో మేనేజర్ ప్రతిమ రెడ్డి, నిర్మల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అల్లూరి మల్లా రెడ్డి, నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంబరి గంగాధర్ లు నిర్మల ఆర్టీసీ డీఎం మంగళవారం కలసి అక్కాపూర్, ముఠాపూర్,న్యూ వెల్మల్, బొప్పారం, కూచన్ పెల్లి మీదుగా సోన్ మండల కేంద్రం వరకు అలాగే న్యూ పోచంపాడ్, భాగ్యనగర్, కిషన్ రావు పేట్, మేడిపెల్లి, మామడ మండలంలోని బురుగుపెల్లి తాండా మీదుగా బురుగుపల్లికి బస్ సౌకర్యం కల్పించాలని కోరారు. బస్ డిపో అధికారులు త్వరలోనే ఆయా గ్రామాలకు బస్ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

Spread the love

Related News

Latest News