Trending Now

టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా 3వ మహాసభలు..

హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: మే 19వ తేదీన తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ( టిడబ్ల్యూజేఎఫ్ ) మేడ్చల్ జిల్లా 3వ మహాసభలు నిర్వహించాలని టిడబ్ల్యూజేఎఫ్ మేడ్చల్ జిల్లా కమిటీ తీర్మానించింది. ఈరోజు నేషనల్ కౌన్సిల్ సభ్యులు వి. పద్మా రెడ్డి అధ్యక్షతన టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశం కుషాయిగూడ లో జరిగింది. ఈ సమావేశంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి బసవ పున్నయ్య మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలపై నికరంగా నిలబడి పోరాటం చేసేది టిడబ్ల్యూజేఎఫ్ సంఘమే నని తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో కూడా మన సంఘం అగ్ర భాగాన నిలపాలని కోరారు. మేడ్చల్ జిల్లా ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి ఎస్.కె సలీమా మాట్లాడుతూ.. మేడ్చల్ జిల్లాలో ఎటువంటి ఆటుపోట్లు వచ్చిన నిలబడి తట్టుకునే బలమైన సంఘం మనదేనని తెలిపారు. జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల్లోనూ నియోజకవర్గ కమిటీలు వేసి నిర్మాణాత్మకంగా ముందుకు సాగాలి అని పిలుపునిచ్చారు. మే 19వ తేదీన మేడ్చల్ జిల్లా మూడవ మహాసభలను ఎంతో ఘనంగా నిర్వహించాలని కోరారు. టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి తన్నీరు శ్రీనివాస్ మాట్లాడుతూ.. వ్యక్తుల కన్నా సంఘం ఎంతో ప్రాధాన్యత కలిగిందని అందుకే ఎప్పటికైనా సంఘం కార్యక్రమాలతో ముందుకు సాగుతుందని తెలిపారు.

జిల్లా కార్యదర్శి మండపాక కళ్యాణ్ చక్రవర్తి గతము లో చేసిన కార్యక్రమాలను, భావష్యత్ లో చేపట్టే కార్యకమలను వివరించారు. జిల్లా కోశాధికారి బెల్ది అశోక్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో మనం నిర్వహించే కార్యక్రమాలను విజయవంతంగా చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుమ్మడి హరిప్రసాద్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యావాపురం రవి, పటేల్ నరసింహ, మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి యాట రాజు, జి రోజా రాణి, కార్యవర్గ సభ్యులు జి అశోక్, శేఖర్, దొమ్మాటి కిరణ్ కుమార్, వీరేష్ ముదిరాజ్, రామచంద్రమూర్తి, దుర్గరావు, కత్బుల్లాపూర్ టిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షలు గడ్డమీది అశోక్, కార్యదర్శి శంకర్, జర్నలిస్ట్ లు మమత, తదితరులు పాల్గొన్నారు.

Spread the love