మెట్రోపై రాజకీయ రగడ.. రేవంత్, కిషన్ రెడ్డిపై కేటీఆర్ విమర్శలు

ప్రతిపక్షం, జూన్ 23: హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం కావడాన్ని ఆయన తప్పుబట్టారు.

శేరిలింగంపల్లిలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన కేటీఆర్, మెట్రో రైలు పేరుతో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ మెట్రోకు సంబంధించిన భారీ ఆస్తులపై ప్రభుత్వం కన్నేసిందని, ప్రాజెక్టు పేరుతో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.

రూ.30 వేల కోట్ల విలువైన మెట్రో ఆస్తులను లక్ష్యంగా చేసుకుని కుట్ర జరుగుతోందని, అందుకే ప్రస్తుత నిర్వహణ సంస్థను పక్కన పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. మెట్రో ప్రాజెక్టును ప్రజల ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ అన్నారు.

Spread the love

Related News

Latest News