ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం జరగనుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఎమ్మెల్యేతో పాటు ఎంపీగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఎంపీగా ఏ స్థానం నుంచి పోటీ చేయాలి అనే విషయంపై సమాలోచనలు చేస్తున్నారు. ఎంపీగా గెలిస్తే.. ఎన్డీఏ నుంచి కేంద్రంలో మంత్రి పదవి తీసుకునే యోచనలో ఉన్నారట పవన్ కళ్యాణ్. అయితే రెండింటికి పోటీ చేయటం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయి అనేదానిపై తర్జనభర్జన పడుతున్నారు. అయితే, దీనిపై జనసేన పార్టీ వర్గాల నుంచి కానీ ఎలాంటి సమాచారం లేదు. ఇదంతా ప్రచారంగానే జనసేన నేతలు చెబుతున్నా.. ఒక ఎమ్మెల్యే, మరో ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన మాత్రం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.