Trending Now

కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం..

నిర్మల్ వీధులలో జోరందుకున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం..

నిర్మల్ డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరి రావు

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, ఏప్రిల్ 29 : కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు సమన్యాయం జరిగి వినూత్నమైన సంక్షేమ పథకాలు అందుతాయని నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు పేర్కొన్నారు. నిర్మల్ పట్టణంలోని పలు వీధులలో అయన ఈరోజు పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్నిజోరుగా కొనసాగించారు. వార్డుల వారీగా సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రతి తలుపును తట్టుతూ.. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలు కార్యక్రమాల కరపత్రాలను ప్రజలకు అందజేస్తూనే ఆదానిని వివరిస్తూ ఓటలను ఆకర్షింప చేశారు. పలు వీధులలో ఉన్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇతర జాతీయ నాయకుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

పదేళ్ల ఎన్డీఏ కూటమి పాలనను అన్ని వర్గాల ప్రజలు గమనించారని ఇందులో కార్పొరేట్ చరణ ఇతర మోసాలే తప్ప అమాయక భారతీయులకు అందింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కకు నెట్టేసి హిందూ ముస్లిం.. ఆలయాలు దేవుళ్ళ పోరా మోసగిస్తూ కార్పొరేటీ కరణ వైపు మొగ్గు చూపారని పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వంలో లబ్ధి పొందింది ధనికుల తప్ప పేదలకు అందింది ఏమీ లేదని ఇది అన్ని వర్గాల వారు గమనిస్తున్నారని చెప్పారు. ఒకవైపు భారత రాజ్యాంగ ప్రజాస్వామ్య పద్ధతిలో జీవిస్తున్న మైనార్టీ వర్గాలను టార్గెట్ చేస్తూ మరోవైపు భారత రాజ్యాంగాన్ని మార్చేస్తామంటూ ఆందోళనకరమైన ప్రకటనలు చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి తగిన విధంగా గుణపాఠం చెప్పే సమయం ఆసన్నమైందని చెప్పారు. మోడీ పదేళ్ల పాలనాను ప్రతి ఒక్కరు నెమరు వేసుకొని కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చేలా అదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు భారీగా ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా పలు కాలనీలలో డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాందేడపు చిన్ను, నిర్మల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చిలుక రమణ, జిల్లా గ్రంథాలయాల చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల కో కన్వీనర్ జిల్లా మైనార్టీల విభాగం ప్రధాన కార్యదర్శి ఎం ఎ లతీఫ్,అప్పాల ప్రభాకర్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు తోట లత నర్సయ్య, మెం,గ పోశెట్టి, అయ్యన్న గారి పోశెట్టి, గాజుల రవి, అరవింద్ కుమార్ కొంతంగణేష్, మాజీ సర్పంచ్ భీమ్ రెడ్డి, సురేష్, మహమ్మద్ మోయినోద్దీన్, మొహమ్మద్ రఫీ, మహమ్మద్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు.

పలువురి కాంగ్రెస్‌లో చేరిక..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాలలో ఆదివారం డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీ హరిరావు పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని శ్రీ కారం చుట్టగా.. పలువురు బీఆర్ఎస్, బీజేపీ పట్టణ, వార్డ్ స్థాయి పదాధికారులు, నాయకులు ఆ పార్టీలను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్ఎస్ యువజన విభాగం సీనియర్ నాయకులు పెండెం శ్రీనివాస్ లతోపాటు పలువురు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరేగా.. వారికి కూచాడి శ్రీహరి రావు వారందరికీ సాధారణంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు వేసి ఈ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపుకు సైనికులుగా పనిచేసి తమ తమ ప్రాంతాలలో ఎక్కువ మొత్తంలో కాంగ్రెస్ కు ఓట్లు పడేలా చూడాలని హిత బోధ చేశారు.

Spread the love

Related News