పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఘాటు స్పందన

ప్రతిపక్షం, జూన్ 03: హైదరాబాద్‌లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సభ నిర్వహించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

గతంలో తెలంగాణ విభజన విధానం నచ్చలేదని చెప్పిన పవన్, ఇప్పుడు ప్రత్యక్షంగా సభలు నిర్వహించడం వెనుక ఉద్దేశం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంపై స్పష్టమైన అభిప్రాయం లేకుండా పరోక్ష వ్యాఖ్యలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే సభ నిర్వహించాల్సిన అవసరం ఏమిటని ఆయన నిలదీశారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదని, ఇది నాలుగు కోట్ల మంది ప్రజల రాష్ట్రమని కేటీఆర్ స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News