నీతి ఆయోగ్ ప్రశంసలు తెలంగాణకు గర్వకారణం: మంత్రి జూపల్లి

ప్రతిపక్షం, జూలై 04: తెలంగాణ పర్యాటక రంగంలో చేపట్టిన సంస్కరణలకు నీతి ఆయోగ్ ప్రశంసలు దక్కడం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, తెలంగాణ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రానికి గుర్తింపు లభించిందని, హోటల్ నిర్మాణ అనుమతుల నిబంధనల సరళీకరణకు నీతి ఆయోగ్ ప్రశంసలు దక్కాయని వెల్లడించారు. సింగిల్ విండో విధానం, ఎఫ్‌ఏఆర్ (FAR) పెంపు వల్ల పెట్టుబడులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

తెలంగాణ టూరిజం పాలసీ 2025–30కు విశేష స్పందన లభిస్తోందని, వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు మార్గం సుగమమైందన్నారు. తెలంగాణను ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News