Trending Now

వామ్మో.. సీడ్స్​ ఎండీ.. కార్పొరేషన్‌ సొమ్ముతో విదేశీ టూర్లు, జల్సాలు

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: తెలంగాణ సీడ్​ కార్పొరేషన్​లో తీస్మాన్​ఖాన్​ భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడ్డట్టు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. సీడ్​ కార్పొరేషన్​లో తవ్విన కొద్దీ అనినీతి, అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత తొమ్మిదేళ్లలో ఈ సంస్థలో లక్షల రూపాయలు హాంఫట్‌ అయ్యాయి. గ్రో ఔట్‌ ఫామ్‌ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన చెరో రూ.50 లక్షలు.. మొత్తం రూ.కోటి స్వాహా అయినా పట్టించుకునే నాథుడు లేడు. అంతేకాదు తెలంగాణను సీడ్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియ’గా మారుస్తామని గత ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించగా, గడిచిన పదేళ్లలో విత్తనోత్పత్తి కాస్తా ఏటా నేలచూపులు చూస్తూ, అథఃపాతాళానికి పడిపోయింది.

విత్తనాల నాణ్యతను ధ్రువీకరించే సీడ్‌ సర్టిఫికేషన్‌ అథారిటీలోనూ అన్నీ అవకతవకలే..!

ఇక్కడ సిబ్బంది బయోమెట్రిక్‌ ఉండదు. ఇద్దరు ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది అసలు విధుల్లోకే రారు. సంతకాలు చేయరు. తొమ్మిదేళ్లుగా జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌గా, సీడ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ హెచ్‌వోడీగా, సీడ్‌ కార్పొరేషన్‌ ఎండీగా కె.కేశవులు పనిచేస్తున్నారు. ఈ తొమ్మిదేళ్లలో రికార్డు స్థాయిలో 28 విదేశీ పర్యటనలు చేశారు. ఏ ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ ఇన్ని విదేశీ పర్యటనలు చేయకపోవడం విశేషం.
హైదరాబాద్‌లో 2019 జూన్‌ నెలలో 32వ ఇస్టా కాంగ్రెస్‌ సదస్సును నిర్వహించారు. 75 దేశాల నుంచి 451 మంది ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరైనట్లు ఇస్టా కాంగ్రెస్‌ నోడల్‌ ఆఫీసర్‌గా వ్యవహరించిన డాక్టర్‌ కె. కేశవులు అప్పట్లో వెల్లడించారు. ఈ సదస్సు నిర్వహణకు అప్పట్లో రైతుబంధు నిధులను మళ్లించినట్లు ఫిర్యాదులు వచ్చాయి. సుమారు 10 కోట్ల రూపాయల నిధులను ఇస్టా కాంగ్రెస్‌ సదస్సుకు ఖర్చు చేశారు.

ఇందులో పెద్ద మొత్తంలో నిధులు దుర్వినియోగమైనట్లు ఆరోపణలున్నాయి. మూడు రోజులకు నోవాటెల్‌ హోటల్‌ హాలు, భోజనాలకే 70 లక్షల ఖర్చు రాశారు. చివరకు నోడల్‌ ఆఫీసర్‌ కేశవులు ఐ-ఫోన్‌ కోసం 65 వేలను ఈ నిధుల్లోంచే ఖర్చు చేశారు. హైదరాబాద్‌లోని పలు స్టార్‌ హోటళ్ల పేరుతో విచ్చలవిడిగా బిల్లులను సమర్పించారు. దీనిపై అప్పట్లో విమర్శలు వచ్చినా.. ఎవరూ పట్టించుకోలేదు. అయితే కొత్త ప్రభుత్వం రావడంతో ఈయన జల్సాలపై అంతర్గత విచారణ కొనసాగిస్తుండడంతో జల్సా రాయుడితో పాటు డుమ్మా కొట్టి జీతం తీసుకుంటున్న సిబ్బంది హడలెత్తుతున్నారు.

Spread the love

Related News

Latest News