ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ఇంటర్నేషనల్ క్రికెట్‌లో టెక్నాలజీ రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇందులో అంపైర్ల నిర్ణయాన్ని సవాల్ చేసే డీఆర్ఎస్ పద్దతి ఎంతో పాపులర్ అయింది. అయితే, త్వరలోనే ఇదే తరహాలో మరో కొత్త రూల్ క్రికెట్‌లో భాగం కాబోతుంది. ఇన్నాళ్లు ప్రయోగ దశలోనే ఉన్న స్టాప్ క్లాక్ రూల్ ను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దాన్ని ఇకపై శాశ్వతం చేయనుంది. జూన్‌లో వెస్టిండీస్, అమెరికా గడ్డపై జరిగే టీ20 వరల్డ్ కప్ తో ఈ రూల్ ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని ఐసీసీ తాజాగా తెలియజేసింది.