Trending Now

రేవంత్ రెడ్డి ఏ మొఖం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నాడు..

మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు

ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 30: సిద్దిపేటకు సీఎం రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని వస్తున్నాడో చెప్పాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సవాల్ విసిరారు. కొడంగల్ నియోజక వర్గానికి తీసుకోపోయిన వెటర్నరీ కాలేజ్ ని సిద్దిపేట్లోనే కొనసాగిస్తానని చెప్పాకనే సిద్దిపేటలో రేవంత్ రెడ్డి అడుగుపెట్టాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో మెదక్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి కి మద్దతుగా ఆటో యునియన్ కార్మికులు నిర్వహించిన సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ప్రపంచ వ్యాప్తంగా మేడే ను కార్మికులు ఘనంగా జరుపుకుంటారని ఆటో యూనియన్ కార్మికులకు ముందస్తుగా మేడే శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మికుల హక్కులు కాల రాయబడ్డాయనీ విమర్శించారు. బీజేపీ పార్టీ కార్మికుల వ్యతిరేక పార్టీగా ముద్ర పడిందన్నారు. కేంద్రంలోని బీజేపీ కార్మికుల హక్కులను కాపాడకుండ ఆదానీ, అంబానీలకు సహకరిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వంద రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్ హామీలు నేటికీ కూడా ఒక్క హామీ అమలు కాలేదనీ దుయ్యబట్టారు.

కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు అమలు చేస్తామని ప్రామిసరి నోట్ లు రాశారని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో గాడ్ ప్రామీజ్ లు చేస్తున్నారని హేద్దేవ చేశారు. ప్రజలు కాంగ్రెస్ కు మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తే వారి హామీలను ఆమోదించనట్లు అవుతుందన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డిని గెలిపిస్తే కాంగ్రెస్ మెడలు వంచి హామీలు అమలు చెపిస్తామని ధీమా వ్యక్తంచేశారు. హామీలు అమలు చేయక బాండ్ పేపర్ బౌన్స్ అయినా కాంగ్రెస్ కు ఓటు తో శిక్ష వేయాలనీ ఓటర్లకు సూచించారు. రాష్ట్రంలో 28మంది ఆటో కార్మికులు చనిపోతే రేవంత్ రెడ్డి కి చీమకుట్టినట్లు కూడా లేదనీ, కనీసం వారి కుటుంబాలను పరామర్శించలేదనీ రాష్ట్రంలో ఆటో కార్మికుల జీవితాలు కాంగ్రెస్ పాలనలో రోడ్డునా పడ్డాయని మండిపడ్డారు.

కాంగ్రెస్ అసమర్ధత తో కరెంటు, నీటి సరఫరా చేయలేక ఉద్యోగస్తులను షోకాజ్ నోటీసులు, ట్రాన్సపర్ చేస్తూ, సస్పెండ్ చేస్తూ వేధిస్తున్నారనీ మండి పడ్డారు ఉద్యోగులు కాంగ్రెస్ కు బుద్ది చెప్పాలంటే ఓటు బుద్ది చెప్పాలనీ వ్యాఖ్యానించారు.బీజేపీ అధికారంలోకి వచ్చాక 60 రూపాయలు ఉన్న పెట్రోల్ డీజిల్ రెట్లు వందకు పెంచారనీ,బీజేపీ పేదలకు ఏమి చేయలేదు. కానీ పెద్దలు అంబానీ, అదానీ లకు దోచిపెట్టిందని విమర్శించారు. బీజేపీ నాయకులకు ప్రచారం చేయడానికి పథకాలు లేక చిత్ర పటాలు పంచుతున్నారని హెద్దేవ చేశారు. గతంలో సిద్దిపేట అభివృద్ధి నీ అడ్డుకున్నా మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘు నందన్ రావు కు ఓటుతో బుద్ది చెప్పాలన్నారు. సిద్దిపేట అంటేనే బిఆర్ఎస్ గడ్డ అని వెంకట్ రాంరెడ్డి నీ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

Spread the love

Related News