Trending Now

ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పందిల్ల గ్రామంలో సిసి రోడ్ ప్రారంభం..

ప్రతిపక్షం, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని పందిల్ల గ్రామానికి గ్రామ అభివృద్ధి కోసం ఎన్ఆర్ఈజీఎస్ పనుల కింద 20 లక్షల నిధులు బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో మంజూరు చేయించినట్టు హుస్నాబాద్ కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా పందిల్ల గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణం కొరకు టిపిసిసి మేంబర్ కేడం లింగమూర్తి హుస్నాబాద్ సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్తారి రవీందర్ ఆధ్వర్యంలో భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. పందిల్ల గ్రామ ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం మంత్రి పోన్నం ప్రభాకర్ గ్రామానికి 20 లక్షల రూపాయలు కేటాయించినారని.. గ్రామ ప్రజలు ఆనందం వ్యక్తంచేస్తూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

Spread the love

Related News

Latest News