ప్రతిపక్షం, జూన్ 04: రాజకీయ పరిస్థితులను బట్టి పొత్తుల అంశంపై నిర్ణయాలు తీసుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. జనసేనతో పొత్తు విషయాన్ని పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు.
‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ సభకు అనుమతి ఇవ్వకపోవడాన్ని ప్రశ్నించారు. పవన్ సభ అంశం ప్రస్తావనకు రావడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆందోళనకు గురయ్యాయని వ్యాఖ్యానించారు.
ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన రాంచందర్ రావు, బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడం ప్రజాస్వామ్య హక్కు అని పేర్కొన్నారు.

















