ప్రత్యేక పూజలు చేసిన బీఆర్ఎస్ జిల్లా నాయకులు కంఠరెడ్డి. తిరుపతిరెడ్డి
జగదాంబ అమ్మవారి,సేవాలాల్ ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలి.
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 05: జగదాంబ అమ్మవారి, సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని బీఆర్ఎస్ జిల్లా నాయకులు. మెదక్ అసెంబ్లీ ఇన్చార్జ్ కంఠరెడ్డి తిరుపతిరెడ్డి ఆకాంక్షించారు.మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కోమటిపల్లి తండాలో నిర్వహించిన శ్రీశ్రీశ్రీ జగదాంబ–సేవాలాల్ దేవాలయ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా కంఠరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. దేవాలయాలు ఆధ్యాత్మికతకు నిలయాలుగా ఉండటమే కాకుండా సమాజంలో ఐక్యత, సోదరభావం, సాంస్కృతిక విలువలను పెంపొందించే కేంద్రాలుగా నిలుస్తాయని అన్నారు. జగదాంబ అమ్మవారి, సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దేవాలయ ప్రతిష్ట మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వాహక కమిటీ సభ్యులను అభినందించిన ఆయన, భక్తులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు చౌదరి సుప్రభాత రావు, మద్దెల రమేష్ కొక్కుప్రవీణ్, ఎస్ కె అహ్మద్, నర్సారెడ్డి, బిక్షపతి, అందే కొండల్ రెడ్డి, సంగు స్వామి, మావురం రాజు,రవి సెట్, నగేష్ పాతూరి సిద్ధ రాములు, మెట్టు యాదగిరి,గొల్ల రాజు, నవత్ మహేష్, మధు సతీష్,మద్దూరి భాను, శ్రీకాంత్ సల్మాన్, ప్రసాద్, గణేష్, నాయకులు కార్యకర్తలు యువత తాండ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.





















