ప్రతిపక్షం,గజ్వేల్ ఏప్రిల్ 8: శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని ఉగాది చిత్రాన్ని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కళారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు సబ్బుబిళ్ల మీద అద్బుతంగా చిత్రించి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ క్రోధి నామ సంవత్సరం అందరికి శుభాకాంక్షలు కలగాలని, తీపి చేదు కలిసిందే జీవితమని.. కష్టం, సుఖం తెలిసిందే జీవితం. ఆ జీవితంలో ఆనందోత్సవాలన్ని పూయించేందుకే ఈ సంవత్సరం వస్తుందన్నారు.