నిర్మల్ వాసిని ఆదరించండి..
అదిలాబాద్ ఎంపీ స్వాతంత్ర అభ్యర్థి చవాన్ సుదర్శన్
ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 8 : ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేస్తున్న చవాన్ సుదర్శన్ బుధవారం ఎన్నికల విస్తృత ప్రచారం నిర్వహించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బీరవెల్లి, చించోలి (M),బండి రేవు తాండ ,పొట్యా తండా తదితర తండాలలో పర్యటించారు. గ్రామస్తులను కలిసి ఇప్పటివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మోసాలను వివరిస్తూ.. తనకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇప్పటికైనా ప్రజలు మేలుకొని ఈ నెల 13న జరిగే పోలింగ్ లో “రోడ్డు రూలర్” గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గం లో నిర్మల్ నుండి ఎవరు పోటీ చేయడం లేదని, నిర్మల్ ప్రాంతంలో అభివృద్ధి జరగాలంటే కేవలం తనకు మాత్రమే ఓటు వేయాలని సూచించారు. లంబాడా వర్గానికి చెందిన తనను ఆదరించి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఆయన అనుచరులు లంబాడా సోదరులు పాల్గొన్నారు.