ప్రతిపక్షం, జూన్ 03: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ప్రాంతీయ వాదంపై వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
మద్రాస్ నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన దీక్ష కూడా ప్రాంతీయ వాదమేనా అని ఆయన ప్రశ్నించారు. అలాగే తమ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి నాయకుడికి ప్రాంతీయ భావన సహజమేనని పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా పెట్టుబడుల పంపిణీ విషయంలో కూడా ప్రాంతీయ ప్రయోజనాలు ప్రభావం చూపుతాయని, గుజరాత్‌కు ప్రాధాన్యం ఇచ్చిన సందర్భాలను ఉదాహరణగా ప్రస్తావించారు.
దేశభక్తి, జాతీయ గీతం అంశాలపై చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ స్పందిస్తూ, ఈ విషయాల్లో ఎవరినీ ఉపదేశాలు వినాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు.

















