Trending Now

అవినీతి, ఆస్తిపాస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా..?

నా ఆస్తిపాస్తులపై సీబీఐకి లేఖ రాసేందుకు రెడీ.. మీకు దమ్ముందా..?

కాంగ్రెస్‌పై కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ ఫైర్

ప్రతిపక్షం, కరీంనగర్, మే 7: ‘‘వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామని మోసం చేసిన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే నాపై అవినీతి ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ నేతలారా.. నా ఆస్తిపాస్తులు, మీరు నాపై చేస్తున్న అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ కోరేందుకు నేను సిద్ధం. మరి మీ ఆస్తిపాస్తులు, అవినీతి, బినామీ ఆస్తులపై సీబీఐ విచారణకు సిద్ధమా? మీరు ఓకే అంటే సీబీఐకి లేఖ రాసేందుకు నేను సిద్ధం. దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించాలి’’ అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ సహా కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. కరీంనగర్ లో గరీబోళ్ల బిడ్డకు, గడీల వారసులకు మధ్య ఎన్నికల పోరు జరుగుతోందని, ఎవరి పక్షాన నిలిచి ఓటేస్తారో ఆలోచించుకోవాలని ప్రజలను కోరారు.

దేశంలో ఎన్నికలు సైతం నరేంద్రమోదీకి, రాహుల్ గాంధీకి మధ్య జరుగుతున్నాయని, ఎవరి నాయకత్వం కావాలో ఆలోచించుకోవాలని సూచించారు. అదే సమయంలో 10 ఏళ్ల ఎన్డీఏ పాలనపై.. అంతకుముందు 10 ఏళ్ల యూపీఏ పాలనపై బేరీజు వేసి ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని విజ్ఝప్తి చేశారు. కేసీఆర్ పెద్ద డ్రామా ఆర్టిస్టు అని, అవినీతికి కేరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. తనను, తన కుటుంబాన్ని అరెస్ట్ చేయకుండా ఉండేందుకు సీబీఐని రాష్ట్రంలోకి అడుగుపెట్టకుండా ఉత్తర్వులు ఇచ్చిన కేసీఆర్.. సిగ్గులేకుండా తాను సుద్దపూసనని, మోదీ అరెస్ట్ చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెబుతున్నారని విమర్శించారు.

ఈరోజు కరీంనగర్ లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ సమక్షంలో ఇద్దరు బీఆర్ఎస్ కార్పొరేటర్లు బీజేపీలో చేరారు. వీరితోపాటు మాజీ జడ్పీటీసీ ఎడ్ల శ్రీను, 47 డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు అన్నపూర్ణ, ఆరెపల్లి మాజీ సర్పంచ్ కాశెట్టి రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పాదం రాజుసహా వందలాది బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన మాజీ కౌన్సిలర్, సీనియర్ నేత ఎర్రం వెంకట్రాజంతోపాటు సుమారు 50 మంది బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. మండలాధ్యక్షులు పాదం శివరాజు ఆధ్వర్యంలో చేరిన వీరందరికీ కాషాయ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఇగ కేసీఆర్ మళ్లా డ్రామాలు షురూ చేసిండు.. మోదీ గారట ఆయనను అరెస్ట్ చేయాలని కుట్ర చేస్తున్నడట. ఆయన సుద్దపూస కాబట్టి అరెస్ట్ చేయలేకపోతున్నారట.. సిగ్గుండాలే.. నీ అవినీతి పుట్టలు బద్దలై ఎప్పుడు అరెస్టై జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందోనని భయంతో సీబీఐ రాకుండా ఉత్తర్వులు జారీ చేసి ఫాంహౌజ్ కే పరిమితమైన పిరికిపందవు నువ్వు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నీ అవినీతి, అరాచకాలను బయటకు తీసి అరెస్ట్ చేస్తుందనే భయంతో ఆ పార్టీతో కలిసి చీకటి కుట్రలు చేస్తున్న నీచుడు కేసీఆర్. సిగ్గులేకుండా తాను అమాయకుడనని, సుద్దపూసనని నటించడమే కాకుండా జీవిస్తూ మోస పూరితమైన మాటలు చెబుతున్నడు. నమ్మించి గొంతు కోసే పార్టీ బీఆర్ఎస్. కరీంనగర్ లో పోటీ చేస్తున్న ఇద్దరు అభ్యర్థులూ నీ వాళ్లే. నీ నాణేనికి బొమ్మ, బొరుసు. వాళ్లు ఎన్నడూ ప్రజల గురించి ఆలోచించలే. ఎన్నడూ కరీంనగర్ ప్రజలను కలవలే. కరీంనగర్ లో నీ ముఖం చెల్లకనే.. డబ్బులు పెట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులతో కలిసి నన్ను ఓడగొట్టడానికి కుట్రలు చేస్తున్నడు.

కరీంనగర్ లో కాంగ్రెస్ నేతలు అడ్డగోలుగా డబ్బులు ఖర్చు పెడుతూ గెలవాలని చూస్తున్నరు. ఇన్ని ప్రలోభాలు పెడుతున్నా లొంగకుండా బీజేపీలో చేరిన నేతలను అభినందిస్తున్నా.. దయచేసి కరీంనగర్ లో పోటీ చేస్తున్న మూడు పార్టీల అభ్యర్థులను బేరీజు వేయండి. నావి ప్రజా పోరాటాలు.. వాళ్లది అవినీతితో ఆస్తులు పోగేసుకునే ఆరాటం.. ఎవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారో.. ఎవరు ప్రజా సమస్యలపై కుటుంబాన్ని పక్కనపెట్టి అలుపెరగని పోరాటాలు చేస్తున్నారో.. ఎవరు కరీంనగర్ ఓటు విలువను పెంచి దేశవ్యాప్తంగా కరీంనగర్ ప్రజలకు గౌరవాన్ని తీసుకొచ్చారో, ఎవరు ప్రజల ఆలోచించండి. తీర్పు ఇవ్వాలని కోరుతున్నా. రేపు ఉదయం 8 గంటలకే నరేంద్ర మోదీ వేములవాడకు వస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తరువాత 9 గంటలకు ఎములాడ బాలానగర్ కోర్టు వద్దనున్న మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఎండలున్న నేపథ్యంలో బహిరంగ సభకు వస్తున్న వారి కోసం కూలర్లు, మజ్జిగ ప్యాకెట్లు, మంచి నీళ్లను అందుబాటులో ఉంచుతున్నాం. ఉదయం 8 గంటల వరకే వేములవాడలోని బాలానగర్ కోర్టు వద్ద గ్రౌండ్ జరిగే బహిరంగ సభకు తరలిరావాలని కోరుతున్నా.

Spread the love

Related News