ముఖాన్ని చూపిస్తేనే ఓటు వేయాలని హెచ్చరిక..
ప్రతిపక్షం, హైదరాబాద్: హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి మాధవి లత సోమవారం పోలింగ్ కేంద్రం వద్ద హల్ చల్ చేశారు. ఓటు వేయాడానికి వచ్చే ప్రతి ఒక్కరు ముఖం చూపిస్తేనే ఓటు వేయించాలని అధికారులకు హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో ఆమె పోలింగ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
పలువురి ఓటర్ల ముఖాలను స్వయంగా ఆమె తనిఖీ చేశారు. ఆమె తీరుపై పలువురు ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో అభ్యర్థికి ఏం పనంటూ మరికొందరు ప్రశ్నించారు. హైదరాబాద్ స్థానం నుంచి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ బరిలోకి దిగారు. అసద్, మాధవిలత మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది.