ప్రతిపక్షం, జూలై 21: టీమిండియా స్టార్ పేసర్, హైదరాబాద్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ డీఎస్పీ హోదాలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సీవీ ఆనంద్ డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆయనను కలిసిన సిరాజ్.. పోలీస్ యూనిఫామ్‌లో డీజీపీ కార్యాలయానికి వచ్చారు.
ఈ సందర్భంగా సిరాజ్ డీజీపీకి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీకి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ప్రజలకు సేవలందించడంలో డీజీపీ సీవీ ఆనంద్ నిరంతరం విజయం సాధించాలని సిరాజ్ ఆకాంక్షించారు.

















