Trending Now

రివర్స్ గేర్‌లో కాంగ్రెస్ పాలన..

మాజీ మంత్రి హరీష్ రావు

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 08 : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పాలన రివర్స్ గేర్ లో నడుస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట లోనీ శివానుభవ మండపంలో బీఆర్ఎస్ కు మద్దతుగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అద్భుతమైన రియల్ ఎస్టేట్ రంగం కుదేలయ్యే మార్పు వచ్చిందన్నారు. కరెంట్ విషయంలో, కళ్యాణ లక్ష్మి, ప్రభుత్వ ఆసుపత్రులలో మార్పు వచ్చిందని దుయ్య బట్టారు. కరోనా సమయంలోనూ కేసీఆర్ రైతుబంధు ఇచ్చాడు, కానీ ఈ ప్రభుత్వంలో ఇంకా రైతుబంధు ఇవ్వలేదని ఇదేనా మార్పు అని మండి పడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణ కు గాడిద గుడ్డు ఇచ్చినయని హెద్దెవా చేశారు.

రిజర్వేషన్ లు, మతం పేరిట బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొంగ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ పార్టీ కార్పోరేట్ లకు మాఫీ చేస్తది, కానీ కర్షకులకు ఏమీ చేయలేదన్నారు. రాహుల్ గాంధీ తెలంగాణ కు వచ్చి ఆరు గ్యారంటీలు అమలు చేశామంటున్నారు. 6 గ్యారంటీలు అమలు చేసిన గ్రామాల్లో మీరు ఓట్లు అడగండి. నేడు టీవీ చూస్తే తిట్లు, దేవుడు మీద ఒట్లు కనబడుతున్నయని విమర్శించారు. కేసీఆర్ పై బురద చల్లే నెపంతో రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చూయించారని అన్నారు. గ్యారంటీలను ఎగబెట్టాలనే డ్రామా తో దివాళా తీసిందని చెప్పడంతో పెట్టుబడులు రావడం లేదని అన్నారు. అందుకే రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని తెలిపారు. జిల్లాలు తీశేసే కుట్ర జరుగుతుందని, ప్రాణం పోయినా సరే సిద్దిపేట జిల్లా తీసేయ్యనియ్యమని అన్నారు. పది మందిని ఒప్పించే శక్తి మీకుంది. సిద్దిపేట అంటే ఎక్కడికి పోయినా గౌరవం ఉంది. మన మీద ప్రేమతో సిద్దిపేట కు రావడం లేదు. మనల్ని దెబ్బ తీసేందుకే వస్తున్నారని చెప్పారు. బీజేపీ అభ్యర్థి దుబ్బాక లో ఏమీ చేయలేదన్నారు. వెంకట్రామ్ రెడ్డి గెలుపు హరీశ్ రావు గెలుపు. సిద్దిపేట అభివృద్ధి కోసం వెంకట్రామ్ రెడ్డి నిత్యం పని చేస్తడు. సిద్దిపేట లో జరిగే హిందూ ధర్మ పరిరక్షణ లో నేను ఉన్నాను. భవిష్యత్తులో ఉంటాను, నా ఊపిరి ఉన్నంత వరకు సిద్దిపేట కోసం పని చేస్తానని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మీద కోపంతోని బీజేపీ పార్టీ కి ఓటు వేస్తే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే. ఫేక్ ప్రచారాలు చేయడం లో బీజేపీ అభ్యర్థి దిట్ట అని ఆయన వాటిని నమ్మవద్దని కోరారు.

Spread the love

Related News