Trending Now

భద్రాచల ముత్యాల తలంబ్రాల పంపిణీ..

ప్రతిపక్షం, గజ్వేల్ మే 18: భద్రాచలం దేవస్థానం గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజానికి 100 కిలోల ముత్యాల తలంబ్రాలు ఆందించారు. ఇందులో భాగంగా శనివారం నాడు సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలో సంస్థ అధ్యక్షులు రామకోటి రామరాజు వందలాది భక్తులకు భద్రాచల ముత్యాల తలంబ్రాల అందించారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు మాట్లాడుతూ.. భద్రాచల సీతారాముల కళ్యాణానికి జగదేవపూర్ గ్రామంతో పాటు తెలంగాల రాష్ట్ర వ్యాప్తంగా 150 కిలోల తలంబ్రాలు అందించామన్నారు. రామకోటి సంస్థ గత 25 సంవత్సరాల నుండి చేస్తున్న సేవలను గుర్తించి అందించినవే ఈ ముత్యాల తలంబ్రాలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో చిగుళ్లపల్లి వెంకటేశం, చంద్ర శేఖర్,కుకుటం కొండలు, మరిపడిగే వెంకటేశం, పెద్ది శంకర్, మరిపడిగే రామకిష్ణ, మహిళలు, చిన్నారులు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News