Trending Now

గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలి

టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 18: టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష నిర్వహణ ప్రక్రియ కు అన్ని ఏర్పాట్లు చెయ్యాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఎం. మహేందర్ రెడ్డి (ఐపీఎస్) అన్ని జిల్లాల కలెక్టర్ల కు తెలియజేశారు. శనివారం హైదరాబాద్ నుండి గ్రూప్-1 పరీక్ష నిర్వహణ గూర్చి అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలిస్ నోడల్ అధికారులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ముందుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టీఎస్పీఎస్సీ గ్రూప్-1 పరీక్ష నిర్వహణ గురించి ప్రతి అంశం వారిగా క్లుప్తంగా వివరించారు. ఈ సమావేశంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ మాట్లాడుతూ.. జూన్ 9వ తేదీన ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు గ్రూప్-1 పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చెయ్యాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా నోడల్ ఆఫీసర్లు కేటాయించిన ఎగ్జామ్స్ సెంటర్లలో పలుమార్లు విజిట్ చేసి అన్ని సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు.

పరీక్ష నిర్వహణకు కావలసిన రూట్ ఆఫీసర్లు, చీఫ్ సూపర్డెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్, ఇన్విజిలేటర్, ఐడెంటిఫికేషన్ ఆఫీసర్స్, బయోమెట్రిక్ ఆఫీసర్స్, బయోమెట్రిక్ ఇన్విజిలేటర్ అందరిని సెలెక్ట్ చేసి పరీక్ష నిర్వాణకు సంబంధించి వారికి శిక్షణ తరగతులను నిర్వహించాలని తెలిపారు. పోలీస్ నోడల్ ఆఫీసర్లు పరీక్ష సెంటర్లలో చుట్టూ గట్టి బందోబస్తు, ఎంపిక చేసిన స్ట్రాంగ్ నుండి ఎగ్జామ్ పేపర్లు సెంటర్లకు చేర్చడం, ఎగ్జామ్ పూర్తయిన తర్వాత పరీక్ష పేపర్లు భద్రపరిచే వరకు పోలీస్ ఎస్కార్ట్ అలాగే పక్కా ప్రణాళికతో బందోబస్తు ఏర్పాటు చేయాలనీ సూచించారు. ఆర్టీసీ, హెల్త్, ట్రాన్స్కో, పోస్టల్ డిపార్ట్మెంట్ వారితో సమావేశం నిర్వహించి ఎక్కడ ఏలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో గ్రూప్-1 పరీక్ష నిర్వహణ జరపాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి మాట్లాడుతూ.. జిల్లాలో 21 సెంటర్లలో 8239 మంది అభ్యర్థులకు గ్రూప్-1 పరీక్ష రాసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో పోలిస్ నోఢల్ ఆపిసర్ అడిషనల్ డీసీపీ(ఏఆర్) సుభాష్ చంద్రబోస్, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రెహమాన్, ఇందూరు కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News