అంగరంగ వైభవంగా సాగిన బోనాల జాతర
ప్రతిపక్షం, వికారాబాద్, ఆగస్టు 04: యాలాల మండల పరిధిలోని జుంటుపల్లి గ్రామంలో బోనాల ఉత్సవాలు మంగళవారం సర్పంచ్ వాణిశ్రీ రమేష్ గౌడ్, రవీందర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తెలంగాణ అనగానే ఆధ్యాత్మికంగా మొదటగా గుర్తొచ్చేది బతుకమ్మ, తర్వాత బోనాలు పండుగ అని అన్నారు. శక్తికి ప్రతీక అయిన అమ్మవార్లను భక్తితో కొలుస్తూ, సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాలు నిలుస్తాయన్నారు ఈ పండుగలు. ఇప్పుడు ఆషాఢ మాసంలో తొలి బోనాల వేడుకలు సైతం మొదలై రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు. మరి, వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ బోనాలకు చాలా ప్రత్యేకత ఉందన్నారు. ఆషాఢం ప్రారంభం నుంచి శ్రావణ మాసం పూర్తయ్యే వరకు దశలవారీగా తెలంగాణ వ్యాప్తంగా గ్రామ దేవతలకు, అమ్మవార్లు బోనాలు సమర్పిస్తారన్నారు. చీరాసారెతో ఇంటి ఆడపడుచుగా గౌరవాన్ని ఇస్తారన్నారు. సుఖశాంతుల్లో, కష్ట కాలంలో తోడుండమని మొక్కుతూ మొక్కులు చెల్లించుకుంటారన్నారు. జుంటుపల్లి గ్రామంలో బోనాల వేడుక కన్నులపండువగా జరిగిందన్నారు.

















