గద్వాల జిల్లా ఓబిసి డిపార్ట్మెంట్ అబ్జర్వర్ గా నందిమల్ల చంద్ర మౌళి నియామకం

•అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే.మేఘా రెడ్డి

ప్రతిపక్షం, జూలై 08, వనపర్తి ప్రతినిధి: జోగులాంబ గద్వాల జిల్లా ఓబిసి డిపార్ట్మెంట్ అబ్జర్వర్ గా వనపర్తి కాంగ్రెస్ నాయకులు నందిమల్ల చంద్ర మౌళిని నియమించారు.ఈ సందర్భంగా వనపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే.తూడి మేఘ రెడ్డి కండువా కప్పి అభినందనలు తెలియజేశారు.కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీ తరపున ఓబీసీలకు న్యాయం చేయలని వారు పేర్కొన్నారు.అదేవిధంగా మున్ముందు ఇంకా ఉన్నత పదవులు పొందాలని వారు ఆకాంక్షించారు. వనపర్తి నియోజకవర్గంలో ఓబీసీలకు మేలు జరిగే పని ఏదైనా ఉంటే తప్పకుండా నెరవేరుస్తాను ఎమ్మెల్యే తెలిపినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సాయి చరణ్ రెడ్డి ల్,షేక్షావలి,ఫోటోగ్రాఫర్ ఆంజనేయులు,నందిమల్ల నిఖిల్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News