SIRకు ఏడాది.. ఎన్ని ఓట్లు తొలగించారంటే?

ప్రతిపక్షం, జూన్ 27: దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియకు ఏడాది పూర్తైంది. ఈ కాలంలో దేశవ్యాప్తంగా సుమారు 6 కోట్ల ఓట్లను ఓటరు జాబితాల నుంచి తొలగించినట్లు సమాచారం. తొలి దశలో బిహార్‌లో 65 లక్షల ఓట్లు తొలగించగా, రెండో దశలో ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, కేరళ, పుదుచ్చేరి, అండమాన్–నికోబార్, లక్షద్వీప్, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా రాష్ట్రాల్లోని 50.99 కోట్ల ఓటర్లలో దాదాపు 10 శాతం (5.18 కోట్లు) పేర్లు జాబితాల నుంచి తొలగించబడ్డాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 16 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోంది. అధికారులు ఓటరు జాబితాలను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు ఈ ప్రక్షాళన చేపడుతున్నట్లు తెలిపారు.

Spread the love

Related News

Latest News