[t4b-ticker]

ఫోన్ పే పని చేయట్లేదు!

ప్రతిపక్షం, ఆగస్టు 14: యూపీఐ చెల్లింపుల కోసం వినియోగించే ఫోన్‌పే సేవల్లో శుక్రవారం రాత్రి అంతరాయం ఏర్పడినట్లు పలువురు వినియోగదారులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. డబ్బులు పంపేందుకు ప్రయత్నించిన సమయంలో లావాదేవీలు పూర్తికావడం లేదని ఫిర్యాదు చేస్తున్నారు.

ఫోన్‌పేలో చెల్లింపు ప్రక్రియ ప్రారంభించి పిన్ నమోదు చేసిన తర్వాత కూడా స్క్రీన్‌ లోడింగ్‌ అవుతూనే ఉంటోందని కొందరు వినియోగదారులు చెబుతున్నారు. మరికొందరికి లావాదేవీ విఫలమైనట్లు లేదా పూర్తి కాకుండా నిలిచిపోతున్నట్లు సమాచారం.

ఈ సమస్య అందరికీ ఎదురవుతోందా లేదా కొంతమంది వినియోగదారులకు మాత్రమే పరిమితమైందా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. ఫోన్‌పే సేవల్లో అంతరాయానికి గల కారణంపై సంస్థ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Spread the love

Related News

Latest News