*పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ చంద్రశేఖర్.
*ఎస్పీఆర్ హైస్కూల్ లో అసిస్టెంట్ సైంటిస్ట్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పరీక్షలు.
*నవంబర్ పరీక్షలకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓకు ఆదేశం.
ప్రతిపక్షం – నల్గొండ, అక్టోబర్ 26: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంలోని ఎస్పీఆర్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో నిర్వహించిన అసిస్టెంట్ సైంటిస్ట్ (అనలిస్ట్ గ్రేడ్-2), అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లు, అభ్యర్థుల హాజరు వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.నవంబర్లో నిర్వహించే తదుపరి ఆన్లైన్ పరీక్షల కోసం జిల్లాలోని పరీక్ష కేంద్రాలను ముందుగానే పరిశీలించి సిద్ధం చేయాలని ఆర్డీఓ వై. అశోక్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణకు అనుగుణంగా ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లను నియమించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వై. అశోక్ రెడ్డి, డీఎస్పీ శివరాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.





























