హైదరాబాద్‌లో అక్రమంగా నిద్రమాత్రలు, దగ్గు సిరప్ విక్రయం.. ఇద్దరి అరెస్ట్

ప్రతిపక్షం, జూలై 19: హైదరాబాద్‌లో అక్రమంగా నిద్రమాత్రలు, దగ్గు సిరప్‌లను విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. సీసీఎస్‌ స్పెషల్ క్రైమ్‌ టీమ్‌, హబీబ్‌నగర్‌ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన దాడుల్లో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు.

వారి వద్ద నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 77,700 నిద్రమాత్రలు, 170 దగ్గు సిరప్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా మందులను విక్రయిస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించినట్లు వెల్లడించారు.

ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న మరో ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్వాధీనం చేసుకున్న మందులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి సరఫరా చేస్తున్నారు, ఈ అక్రమ వ్యాపారం వెనుక ఉన్న ప్రధాన వ్యక్తులు ఎవరనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది.

Spread the love

Related News

Latest News