చిన్న రైస్ మిల్లర్లను వేధించడం ఆపాలి.. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఇవ్వాలి: కవిత

ప్రతిపక్షం, జూలై 15: రైతులతో పాటు చిన్న రైస్ మిల్లర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోందని కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వేల కోట్ల రూపాయల సీఎంఆర్ బకాయిలు ఉన్న పెద్ద రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా, లక్షల రూపాయల లెవీ బకాయిలు ఉన్న చిన్న రైస్ మిల్లర్లపై కేసులు నమోదు చేసి వేధించడం అన్యాయమని విమర్శించారు.

ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల సీఎంఆర్ బకాయిలు ఎగ్గొట్టి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న పెద్ద రైస్ మిల్లర్ల నుంచి వెంటనే బకాయిలు వసూలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. చిన్న మిల్లర్లకు మాత్రం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ (ఓటీఎస్) అవకాశం కల్పించి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

రైతులు, చిన్న రైస్ మిల్లర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సమాన వైఖరి అవలంబించాలని, చిన్న పరిశ్రమలను కాపాడేలా తక్షణ చర్యలు చేపట్టాలని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News

Latest News