ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎంకు రైతులంటే ఎందుకు అంత చిన్నచూపని ప్రశ్నించారు. పంటలు ఎండిపోతున్నా పట్టించుకోవట్లేదు.. వడగండ్లు ముంచెత్తినా కన్నెత్తి చూడడం లేదని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు తప్ప గల్లీలో రైతుల కన్నీళ్లు కనిపించవా? అని దుయ్యబట్టారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న దృష్టి.. పంట నష్టంపై లేదా అని ఫైరయ్యారు.