Trending Now

ప్రమోషన్లకు టెట్ గండం..

సీపీఎస్ రద్దు చేయాలి..

మెరుగైన హెల్త్ కార్డులు ఇవ్వాలి..

ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందగౌడ్

ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 26: ప్రభుత్వం వెంటనే ఉపాధ్యాయుల బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. శుక్రవారం సిద్దిపేట పబ్లిక్ సర్వెంట్స్ హోమ్ లో జరిగిన జిల్లా స్థాయి ఉపాధ్యాయ శిక్షణ శిబిరంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పెండింగ్లో ఉండడం వల్ల విభిన్న సమస్యలు ఉప్పన్నమవుతున్నాయని చెప్పారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, ఉపాధ్యాయుల ప్రమోషన్స్ కు గండంగా మారిన టెట్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత హెల్త్ కార్డుల వల్ల సంపూర్ణ ప్రయోజనం కలగడం లేదని తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మెరుగైన ఆరోగ్య కార్డులను మంజూరు చేయాలని కోరారు.

ఉపాధ్యాయులు సర్వీస్ రూల్స్‌పై చక్కటి అవగాహనను పొంది క్షేత్ర స్థాయిలో ఉపాధ్యాయులకు తోడ్పాటునందించాలని వారు సూచించారు. ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏవీ సుధాకర్ సెలవు నియమ నిబంధనలపై అవగాహన కలిగి ఉండాలని, క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులకు అండగా నిలవాలని సూచించారు. మహిళా ఉపాధ్యాయులకు ప్రభుత్వం కల్పించే ప్రసూతి, శిశు సంరక్షణ, అబార్షన్, తదితర సెలవుల పట్ల అవగాహన కల్పించారు. అధ్యయన సెలవులు, అర్థ వేతన సెలవులపై ఉత్తర్వులతో అవగాహన కలిగించారు. సీసీఏ రూల్స్ 1991 పై అవగాహన కల్పించారు. పెన్షన్ రూల్స్ పై ఎస్టీయూ సీనియర్ నాయకులు పున్నగణేష్, 75 వసంతాల ఎస్టీయూ ప్రస్థానం, ఎమ్మెల్సీల పాత్ర, ఉద్యమ చరిత్ర గురించి పి. ప్రవీణ్ కుమార్ వివరించారు.

ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు పట్నం భూపాల్ అధ్యక్షతన జరిగిన శిబిరంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మట్టపల్లి రంగారావు, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి ఆట సదయ్య లు ఉపాధ్యాయ విధులు, ప్రభుత్వ జీవోల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాడ శ్రీధర్, ఆర్థిక కార్యదర్శి వడ్లకొండ శ్రీనివాస్ ఎస్టీయూ నాయకులు ఐత అంజయ్య, నాగభూషణం, బిక్షపతి, రాజా నరసయ్య, ఖాత యాదగిరి, లింగారెడ్డి, లింగ శ్రీనివాస్, ఉండ్రాళ్ళ రాజేశం, మురికి శ్రీనివాస్, సురగొని రాములు, రాచకొండ భూపాల్,కంతుల రాములు, నీలం గురువయ్య, సంపత్ కుమారు, కాల్వ శ్రీకాంత్, వేణుగోపాల్, కలకుంట్ల రాములు, ఎల్లయ్య, శ్రీనివాసు, రాములు, ఉపేందర్ గౌడ్,బాల నరసయ్య, వినయ్ కుమార్, పోలీసు యాదగిరి, చంద్రశేఖర్, బస్వ రాజ్ కుమార్, ఆకుల హరిదాస్, కరీం, కే.యం. ఆలం,సుధాకర్ మరియు ఎస్‌టీయూ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News