Trending Now

భారత రాజ్యాంగ పరిరక్షణకు ఐక్య ఉద్యమం..

డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి పి. శంకర్

ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 26: మనిషిని మనిషిగా చూడకుండా నిరాకరించిన మనువాదాన్ని ఓడించి ప్రజలందరికి స్వేచ్చ, సమానత్వం, సోదరభావం, సామాజిక ఆర్ధిక, రాజకీయ న్యాయన్ని అందిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకొవడానికి ఐక్యంగా ఉద్యమించాలని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ కార్యదర్శి పి. శంకర్ అన్నారు. డీబీఎఫ్ అధ్వర్యంలో భారత రాజ్యాంగ పరిరక్షణ ప్రచారోద్యమ జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం శుక్రవారం నాడు సిద్దిపేటలో నిర్వహంచారు. ఈ సందర్భంగా పి. శంకర్ మాట్లాడుతూ.. మహనీయులైన పూలే, అంబేద్కర్, జగ్ జీవన్ రామ్ ల జయంతుల మహత్సోవం సందర్భంగా రాజ్యాంగ రక్షణ ప్రచారోద్యమాన్ని చేపట్టామని శంకర్ తెలిపారు. విద్య, ఉద్యోగం, ఆస్తులు, సంపదలను రాజకీయ అధికారాన్ని అణగారిన వర్గాలకు మనువాదం దూరం చేసిందన్నారు.

మానవ హక్కులను అందించిన రాజ్యాంగాన్ని 400 సీట్లు గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని పదే.. పదే ప్రకటిస్తున్న కేంద్ర మంత్రుల కుట్రలను అర్థం చేసుకొని.. రానున్న పార్లమెంటు ఎన్నికలలో బీజీపీని ఓడించి రాజ్యాంగాన్ని రక్షించుకొవాలన్నారు. దళిత నేత మల్లయ్య మాట్లాడుతూ.. గత పదేళ్ళుగా మోడీ ఇచ్చిన ఏ హామిని నేరవెర్చలేదన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని కేంద్ర పాలకుకులు కాలరాస్తున్నారన్నారు. రెండు కొట్ల ఉద్యోగాలను భర్తీ చేస్తామనే హామిని నిలబెట్టుకోలేదన్నారు. ఈ సమావేశంలో పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వి.శ్రీకాంత్, డీబీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు భీమ్ శేఖర్, డీహెచ్‌పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, డీఎస్‌ఎస్ టౌన్ ప్రెసిడెంట్ రజాక్, భుమేష్, భూమయ్య, శ్వేత, సుజాత, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News