Trending Now

ప్రజాసేవ కోసం వస్తున్నా ఆశీర్వదించండి..

మెదక్ ఎంపీ అభ్యర్థి పి. వెంకట్రామరెడ్డి..

ప్రతిపక్షం, గజ్వేల్, ఏప్రిల్ 26: నీళ్లు ఉన్నా ఇవ్వలేని దుస్థితి, కరెంట్ ఉన్నా.. సరఫరా చేయలేని పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని, కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని మెదక్ ఎంపీ అభ్యర్థి పి. వెంకట్రామరెడ్డి పేర్కొన్నారు. జగదెవపూర్ లో పీర్లపల్లి మాజీ సర్పంచ్ అంకిల్ల యాదిరెడ్డి ఏర్పాటు చేసిన రుద్ర ట్రేడర్స్‌ను ఎమ్మెల్సీ డా. వంటేరు యాదవ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరువు కాటకాలతో తల్లడిల్లిన తెలంగాణ లో గోదావరి జలాలు పారించి తాగు, సాగు నీటి గోస తీర్చిన ఘనత కేసీఆర్ కే దక్కిందన్నారు. 4 మాసాలలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయక పోగా, ఉన్న కరెంటు, నీళ్లు ఇవ్వడం లేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. మాయ మాటలు చెప్పిన రఘునందన్ రావుకు దుబ్బాక ప్రజలు బుద్ది చెప్పారని.. ఎంపీ ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదన్నారు. జిల్లా సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న పరిపాలనా అనుభవం తో మీ పనులు సులభంగా పరిష్కారతాయన్నారు.

నా లెక్క యువతీ, యువకులను తీర్చిదిద్దడం కోసమే గెలిచిన నెల రోజుల్లో 100 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ప్రతి నియోజకవర్గంలో యువతీ, యువకులకు ఉచితంగా కోచింగ్ కేంద్రాలు, వృత్తి నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేసి.. జాబ్ మేళా ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక ఫంక్షన్ హాల్ నిర్మించి నిరుపేదలకు ఉచితంగా అందిస్తామన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల గుణ గుణాలను చూసి ఓట్లెయ్యాలని ఆయన కోరారు. జగదేవపూర్ ప్రజలతో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడి అభివృద్ధిలో తన భాగస్వామ్యాన్ని గుర్తు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కి ఇచ్చిన మెజారిటీ తనకు ఇవ్వాలని కోరారు. మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రతి ఒక్కరు కేసీఆర్ లా గడప గడపకు వెళ్లి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను, కాంగ్రెస్ వైఫల్యాలను వివరించాలని కోరారు. అలాగే నిరుపేద యువతీ, యువకులకు మేలు చేసే విధంగా ఏర్పాటు చేయనున్న 100 కోట్ల ట్రస్టు ను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

Spread the love

Related News